Redmi Note 12: రెడ్‌మి నోట్ 12.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్

Redmi Note 12 Phone: నేడు.. అంటే మార్చి 24న రెడ్‌మి నోట్ 12 ఫోన్‌స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వరల్డ్ వైడ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మార్చి 30న.. అంటే మరో వారం రోజుల్లో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. 

  • Mar 24, 2023, 20:19 PM IST

Redmi Note 12 Phone: నేడు.. అంటే మార్చి 24న రెడ్‌మి నోట్ 12 ఫోన్‌స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వరల్డ్ వైడ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మార్చి 30న.. అంటే మరో వారం రోజుల్లో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. 

1 /4

Redmi Note 12 ధర EUR 199: విదేశాల్లో ఇది 199 యూరోలు ఉండగా.. మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 17,720కి సమానం అవుతుంది. రెడ్‌మి నోట్ 11 ఇండియాలో మొదటిసారిగా లాంచ్ అయినప్పుడు ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 14,499 అనే విషయం మర్చిపోవద్దు.

2 /4

Redmi Note 12 Phone: ఈ అప్‌కమింగ్ రెడ్‌మి ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాతో ఉన్న డిస్‌ప్లేను అమర్చారు. 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. 

3 /4

Redmi Note 12 Phone: రెడ్‌మి ఫోన్ అధికారిక వెబ్‌సైట్‌లో రెడ్‌మి నోట్ 12 మెయిన్ ఫీచర్స్ ని పరిశీలిస్తే.. టీజర్‌ ప్రకారం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 685 SoC, 4G చిప్‌తో పనిచేయనుంది. 11GB RAM వరకు RAM పెంచుకోవడానికి అనుమతి లభిస్తుంది.

4 /4

Redmi Note 12 Phone: రెడ్‌మి ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, అదనపు సెన్సార్ల ప్రత్యేకతలు, 48MP సెన్సార్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2MP డెప్త్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే 5,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సౌకర్యం కూడా దీనిసొంతం.